ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను మ‌ర్రి ప్ర‌వ‌ళిక కుటుంబ స‌భ్యులు బుధ‌వారం ఉద‌యం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌వ‌ళిక కుటుంబ స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ ధైర్యం చెప్పారు.కేటీఆర్ మాట్లాడుతూ.. ప్ర‌వ‌ళిక కుటుంబానికి జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చ‌లేం అని పేర్కొన్నారు. నిందితుడిని ప‌ట్టుకుని చ‌ట్ట‌ప‌రంగా శిక్ష‌ప‌డేలా చూస్తామ‌న్నారు. ప్ర‌వ‌ళిక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం.. ఒక‌రికి ఉద్యోగం ఇస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

బుధ‌వారం ఉద‌యం కరీంనగర్​లో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై స్పందించారు.“ప్రవళిక మృతిని కూడా రాజకీయం చేశారు. ప్రవళిక కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చారు.. న్యాయం చేయాలని కోరారు. ప్రవళిక కుటుంబాన్ని ఆదుకుంటాం. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తాం. అంతే కాకుండా ఆ అమ్మాయిని వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందుగా జాగ్రత్తపడతాం.” అని కేటీఆర్ తెలిపారు.

We will give a job to one of Pravalika's family Minister KTR

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)