దేశ వ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో అగ్నిపథ్‌ పథకం, అగ్నివీర్‌లకు సంబంధించి వాట్సాప్‌ గ్రూప్‌లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో, 35 వాట్సాప్‌ గ్రూప్‌లను నిషేధించినట్లు కేంద్ర సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసినవారిని, హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించినవారిని గుర్తించేందుకు పోలీసులు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే, నిషేధం విధించిన వాట్సాప్‌ గ్రూపుల వివరాలను మాత్రం కేంద్రం గోప్యంగా ఉంచింది. ఇక, ఈ వాట్సాప్‌ గ్రూపులకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)