గేమింగ్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ మల్టీప్లేయర్‌ షూటింగ్‌ గేమ్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (BGMI) మరోసారి భారత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది.ఈ గేమ్‌ గతేడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గేమ్ కార్యకలాపాలను పునః ప్రారంభించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతానికి మూడు నెలల ట్రయల్‌కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

గేమింగ్ కంపెనీ సర్వర్ లొకేషన్లు, డేటా భద్రతకు సంబంధించి నిబంధనలు పాటించినందున మూడు నెలల ట్రయల్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు రాజీవ్‌ చంద్రశేఖర్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు.యూజర్లపై ప్రభావం, ఎడిక్షన్‌ వంటి అంశాలను పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.సరిహద్దుల్లో ఘర్షణ సమయంలో చైనాకు చెందిన టెన్సెంట్‌తో క్రాఫ్టన్‌కు సంబంధాలు ఉన్నాయంటూ బీజీఎంఐపై కేంద్రం నిషేధం విధించింది. నిషేధం నాటికి ఈ గేమ్‌కు 100 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి.

Here's IANS Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)