డిజిటల్ మోసాలను అరికట్టేందుకు అనుమానిత ఆర్థిక లావాదేవీలను జరుపుతున్న 70 లక్షల మొబైల్ నెంబర్లను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. ఆర్థిక సైబర్ భద్రత, పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంగళవారం జోషీ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సమావేశంలో డిజిటల్ మోసాల నివారణకు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలో మోసానికి సంబంధించి మాట్లాడుతూ రాష్ర్టాలను దీనిపై దృష్టి పెట్టాలని కోరినట్టు, వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉండేలా చూడాలన్నట్టు చెప్పారు.
ఇదిలావుంటే ప్రభుత్వ రంగానికి చెందిన యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)ల్లో ఇటీవలి కాలంలో డిజిటల్ మోసాలు జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐఎంపీఎస్ ద్వారా ఖాతాదారుల ఖాతాల్లోకి యూకో బ్యాంక్ నుంచి పొరబాటున రూ.820 కోట్లు బదిలీ అయ్యాయి. దీన్ని గుర్తించిన బ్యాంక్.. ఆ తర్వాత సదరు ఖాతాలను బ్లాక్ చేసి రూ.649 కోట్లు రాబట్టింది.ఇది ఎలా జరింగదనే దానిపై బ్యాంకులు ఇంకా వివరణ ఇవ్వలేదు.
Here's News
Digital Payment Fraud Cases: Central Government Suspends 70 Lakh Mobile Numbers Due to Suspicious Activity, Says DFS Secretary#DigitalPayment #Fraud #DigitalFraud https://t.co/vCsrXSI1mc
— LatestLY (@latestly) November 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)