అంతర్జాతీయ బ్యాంకు గోల్డ్‌మాన్ శాక్స్ తన కంపెనీ తన వార్షిక సమీక్ష ప్రక్రియలో భాగంగా 1300-1800 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది. మొత్తం సిబ్బంది సంఖ్యలో ఇది 3-4 శాతానికి సమానం. బ్యాంకులోని వివిధ విభాగాలపై లేఆఫ్‌ల ప్రభావం పడొచ్చని అంచనా. ఉద్యోగులను తొలగించినా.. 2023తో పోలిస్తే ఈ ఏడాది చివరకు సిబ్బంది సంఖ్య ఎక్కువగానే ఉంటుందని గోల్డ్‌మాన్ శాక్స్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇతర ప్రధాన దిగ్గజ బ్యాంకులు కూడా పనితీరు సరిగా లేని ఉద్యోగులను తొలగించవచ్చని ఆ కథనం పేర్కొంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికాలో పెద్ద బ్యాంకులు 5,000కు పైగా ఉద్యోగాల కోత విధించాయి. ఇందులో సిటీగ్రూప్ అత్యధికంగా 2,000 మందిని తొలగించింది. ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్‌లైన్ డెలివరీ సంస్థ డంజో, ఆర్థిక మాంద్య భయాలే కారణం
Here's News
BREAKING: The Wall Street Journal reports Goldman Sachs is set to lay off over 1,300 employees
— The Spectator Index (@spectatorindex) August 30, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)