గూగుల్ (Google)‌ 25వ జన్మదినం నేడు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గూగుల్‌ డూడుల్‌ ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది.సరిగ్గా పాతిక సంవత్సరాల కిందట అంటే 1998 సెప్టెంబర్ 4వ తేదీన గూగుల్‌ ఆవిర్భవించింది. అయితే, గూగుల్‌ తన పుట్టినరోజును ఏటా సెప్టెంబర్‌ 27వ తేదీన జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భానికి గుర్తుగా ప్రత్యేక డూడుల్‌ను ప్రదర్శించింది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత గూగుల్ డూడుల్‌ మారిపోయింది.

Google స్థానంలో తన 25వ వార్షికోత్సవాన్ని తెలియజేస్తూ G25gle అనే అక్షరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం ఈ డూడుల్‌ ఆకట్టుకుంటోంది.అమెరికాకు చెందిన లారీ పేజ్‌, సర్జీ బ్రిన్‌ స్టోన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థులుగా ఉన్నప్పుడు 1998 సెప్టెంబర్‌ 4న ఈ సంస్థను స్థాపించారు. గూగుల్‌ మొదటి ఏడేళ్లు సెప్టెంబర్‌ 4నే వార్షికోత్సవం నిర్వహించింది. కానీ, రికార్డుల ఆధారంగా 2005 నుంచి సెప్టెంబర్‌ 27కి మార్చింది.

Google Birthday 2023 (photo-X)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)