లేఆప్స్ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. తాజాగా, మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్‌వర్క్ లింక్డిన్ (LinkedIn) మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.సుమారు 20 వేల మంది సిబ్బందిని కలిగి ఉన్న లింక్డిన్ తాజాగా రెండో రౌండ్ లేఆఫ్స్‌ను ప్రకటించింది. దీంతో సంస్థలోని దాదాపు 3 శాతం అంటే 668 మంది ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం పడనుంది.
ఇంజినీరింగ్, ఉత్పత్తి, ఫైనాన్స్ విభాగంలోని ఉద్యోగులపై వేటు పడనుంది. ఈ విషయాన్ని లింక్డిన్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. ‘ఈ రోజు మేము మా బృందంతో కలిసి చేసిన మార్పుల వల్ల ఇంజినీరింగ్, ఉత్పత్తి, ఫైనాన్స్ విభాగాల్లో దాదాపు 668 మంది తమ ఉద్యోగం కోల్పోనున్నారు’ అని లింక్డిన్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
Here's News
NEW: @LinkedIn is laying off 668 employees amid restructuring.
The majority of the layoffs, some 563, will be in R&D, with teams across engineering, product, talent, and finance impacted https://t.co/bsNVA4BDiE
— TechCrunch (@TechCrunch) October 16, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)