Mark Zuckerberg Loses 3 Billion Dollars: సాంకేతిక లోపం కారణంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు మంగళవారం గంట పాటు పనిచేయని సంగతి విదితమే. దీంతో మెటా సీఈవో జుకర్‌బర్గ్ మంగళవారం ఒక్క గంటలో 3 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.25 వేల కోట్లు) నష్టపోయారు. దీంతో మెటా షేర్లు భారీగా క్షీణించాయి. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్‌లో జుకర్‌బర్గ్ సంపద సుమారు 3 బిలియన్లు తగ్గి 176 బిలియన్లకు పడిపోయింది. అయినప్పటికీ కుబేరుల్లో అతను నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం మెటా షేర్లు 1.6 శాతం క్షీణించాయి. ఫలితంగా జుకర్‌బర్గ్ నికర విలువకు కోత పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్, ఎక్స్ వేదికగా ట్వీట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
Here's News
Mark Zuckerberg's Meta loses $3 billion after Instagram, Facebook global outage, company's share price tumbles | Mint https://t.co/JEVcUXV6FR
— Marc R Gagné MAPP (@OttLegalRebels) March 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)