భార‌త్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా మోటో జీ22ను ఏప్రిల్ 8న లాంచ్ చేసేందుకు మోటోరొలా స‌న్నాహాలు చేప‌ట్టింది. లాంఛ్‌కు ముందు ఈ మొబైల్ ప్లిఫ్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. వెబ్‌సైట్‌లో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేష‌న్స్ కూడా లిస్ట్ అయ్యాయి. మోటో జీ22 మీడియాటెక్ హెలియో జీ37 ప్రాసెస‌ర్‌, 6.6 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాట‌రీ, 50 MP క్వాడ్ కెమెరా సెట‌ప్‌ వంటి ప‌లు ఫీచ‌ర్ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌పోన్ ఐఫోన్ త‌ర‌హా ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ క‌లిగి ఉండ‌టం ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాను అమ‌ర్చారు. ఇక మొటొరోలా ప్ర‌స్తుతం మోటో జీ22 లాంచ్ డేట్‌ను వెల్ల‌డించిన‌ప్ప‌టికీ దాని ధ‌ర గురించి ప్ర‌స్తావించ‌లేదు. మోటో జీ22 భార‌త్‌లో రూ 14,999 వ‌ర‌కూ అందుబాటులో ఉండే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)