రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆయన కుమారుడు ఆకాష్ అంబానీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జియో డైరెక్టర్ పదవి నుంచి ముఖేశ్ అంబానీ వైదొలగినట్టు జియో మంగళవారం తెలిపింది. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,ముఖేశ్ కుమారుడు ఆకాష్ అంబానీని కొత్త బోర్డు ఛైర్మన్‌గా సంస్థ ప్రకటించింది. కంపెనీ డైరెక్టర్ పదవికి ముఖేశ్ అంబానీ రాజీనామా చేయడంతో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ బాధ్యతలు స్వీకరించారని వెల్లడించింది. సోమవారం (జూన్ 27, 2022) జరిగిన జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు.
Billionaire Mukesh Ambani resigns from board of Reliance Jio; son Akash made chairman: Co filing
— Press Trust of India (@PTI_News) June 28, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)