భారతీయ వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ భారీ షాకిచ్చింది. పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకునే వెసులుబాటును తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ ఒక్క కుటుంబానికే పరిమితం అవుతుంది. అది కూడా నేటి నుంచే అమలు చేస్తున్నట్టు సమాచారం. పాస్‌వర్డ్‌ను ఎవరికి పడితే వారికి షేర్ చేస్తుండడంతో ఆదాయానికి గండిపడుతోందని భావించిన నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాస్‌వర్డ్‌ను కుటుంబంతో కాకుండా బయటి వ్యక్తులకు షేర్ చేస్తున్న యూజర్లకు ఈ-మెయిల్స్ పంపింది. ఇకపై ఇంట్లోని వారు (కుటుంబ సభ్యులు) మాత్రమే పాస్‌వర్డ్ ఉపయోగించుకోగలుగుతారని, ఎక్కడైనా, ఏ ప్రదేశంలోనైనా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)