ప్రధాని మోదీ నేడు మరో అరుదైన ఘనత సాధించారు. వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్‌కు (Personal Youtube Channel) 2 కోట్ల పైచిలుకు మంది సబ్స్క్రైబర్లు (2 Crore subscribers) కలిగిన తొలి దేశాధినేతగా రికార్డు సృష్టించారు. ప్రధాని తరువాతి స్థానంలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారోకు (Jair Bolsonaro) కేవలం 64 లక్షల సబ్స్క్రైబర్లు ఉండటంతో మోదీ సాధించిన ఫీట్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అత్యధిక యూట్యూబ్ సబ్స్క్రైబర్లు కలిగిన రాజకీయనేతల్లో మోదీ, బోల్సోనారో తరువాతి స్థానాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆక్రమించారు. ఆయనకు 1.1 మిలియన్ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. డిసెంబర్లో ప్రధాని వీడియోలకు 22.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. అధ్యక్షుడు జెలెన్స్కీ వీడియోలకు వచ్చిన వ్యూస్ కంటే ఇవి 43 రెట్లు అధికం. ఈ నెల వ్యూస్ పరంగా జెలెన్స్కీ రెండో స్థానంలో ఉన్నారు. మొత్తం 4.5 బిలియన్ వ్యూస్ ఉన్న మోదీ ఛానల్, ఇతర రాజకీయనాయకుల ఛానల్స్ కంటే ముందే ఉంది.
Here's News
PM @narendramodi becomes first world leader whose YouTube Channel reaches 2 crore subscribers. pic.twitter.com/imOaaenq6s
— Press Trust of India (@PTI_News) December 26, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)