Tokyo, June 1: ప్రమాదాలు, పుచ్చిపోవడం వంటి కారణాలతో ఒకసారి దంతాలు (Teeth Lose) ఊడిపోతే మళ్లీ తిరిగి రావు. ఇంప్లాంట్స్ చేసుకొన్న కృత్రిమ దంతాలతోనే (Artificial Teeth) నెట్టుకురావాలి. అయితే, ఈ అవసరం లేదని, దంతాలు ఊడిన చోట కొత్త దంతాలు పెరగడం సాధ్యమే అంటున్నారు జపాన్ కు శాస్త్రవేత్తలు. దీని కోసం ఒక యాంటీబాడీ డ్రగ్‌ను తయారుచేశారు. సాధారణంగా వయసు పెరిగిన తర్వాత దంతాల పెరుగుదలను ఉటెరిన్ సెన్సిటైజేషన్-అసోసియేటెడ్ జీన్-1(యూఎస్‌ఏజీ-1) అనే ప్రొటీన్ నిలిపివేస్తుంది. ఈ ప్రొటీన్ ను తాము తయారుచేసిన డ్రగ్ లక్ష్యంగా చేసుకొని డీయాక్టివేట్ చేస్తుందని, తద్వారా దంతాలు మళ్లీ పెరగడానికి ఉన్న అడ్డంకిని తొలగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Can we regrow our teeth? Japanese scientists say yes! https://t.co/ebHVWVJgPo
— thaiparampil (@thaiparampil) May 31, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)