Newyork, Dec 15: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న క్యాన్సర్ (Cancer) చికిత్సలో కీలక ముందడుగు పడింది. కీమోథెరపీ, రేడియోథెరపీ విధానంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాన్ని సూచిస్తూ బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (IISc) పరిశోధకులు కొత్త చికిత్సా విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటివరకూ ఉన్న విధానాల్లో వ్యాధిని నయంచేసే సమయంలో క్యాన్సర్ కణాలతో పాటు చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణాలు కూడా మరణిస్తూ ఉండేవి. దీంతో వ్యాధి నయం కావడానికి ఏండ్లు పట్టేది. దీనికి పరిష్కారాన్ని కనిపెట్టిన పరిశోధకులు ‘క్యాన్సర్ ఇమ్యునోథెరపీ 2.0’ (Cancer Immunotherapy 2.0) పేరిట రోగనిరోధకశక్తికి కీలకమైన ఇంటర్‌ఫెరోన్-గామా సైటోకైన్‌లను ఉత్తేజితం చేయడం ఆరంభించారు. దీంతో క్యాన్సర్ కణాలపై మాత్రమే దాడిచేసే ఇమ్యూనిటీ సెల్స్‌ను సృష్టించడంలో విజయం సాధించారు. తాజా విధానంతో క్యాన్సర్‌ను నయంచేసే సమయం చాలావరకూ తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
A new study by researchers at the Indian Institute of Science (IISc), Bangalore has proposed approaches to make non-responsive cancer cells respond better to immunotherapy. @iiscbangalore #cancerresearch #immuneresponse https://t.co/QMUVR1C3sk
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) December 12, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)