రేపు మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు రాకెట్ ద్వారా చంద్ర‌యాన్‌-3ను నింగిలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది. యోగం స‌క్సెస్ కావాల‌ని కోరుతూ ఇవాళ ఉద‌యం ఇస్రో చీఫ్ ఎస్‌. సోమ‌నాథ్‌.. తిరుమ‌ల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆగ‌స్టు 23వ తేదీన చంద్ర‌యాన్‌-3 రోవ‌ర్‌.. చంద్రుడిపై దిగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల బృందం ఇవాళ తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు. చంద్ర‌యాణ్‌-3 ప్ర‌తిమ‌తో శాస్త్ర‌వేత్త‌లు ఆల‌యాన్ని విజిట్ చేశారు.

నేష‌న‌ల్ అట్మాస్పియ‌రిక్ రీస‌ర్చ్ ల్యాబ‌రేట‌రీ డైరెక్ట‌ర్ అమిత్ కుమార్ ప‌త్రా, చంద్ర‌యాన్‌-3 ప్రాజెక్టు డైరెక్ట‌ర్ వీరాముత్తు వేల్‌, అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ క‌ల్ప‌నా కాళ‌హ‌స్తితో పాటు ఇత‌ర శాస్త్ర‌వేత్త‌లు కూడా ఇవాళ శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్నారు.

ISRO Chief on launch of Chandrayaan-3

ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)