భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ISRO) చేపడుతున్న గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాముల పేర్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్​తోపాటు వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.ఈ వ్యోమగాములు.. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే నాలుగు శక్తులని ‍ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో గల విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్​లో గగన్‌ యాన్‌ ప్రాజెక్టు పురోగతిని ప్రధాని పరిశీలించారు. అనంతరం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ను​ సత్కరించారు.

40 ఏళ్ల తర్వాత భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెట్టనున్నారు. ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములను భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్లనున్నారు. మూడు రోజులపాటు వారిని అక్కడే ఉంచి, తిరిగి భూమి మీదకు తీసుకొస్తారు. ఈ మిషన్‌లో పాల్గొనే ఆస్ట్రోనాట్లు సురక్షితంగా తిరిగి సముద్రంలో ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Here's Video

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)