Newdelhi, Dec 9: ఏడాదికి ఏకంగా ఆరుసార్లు పంటనిచ్చే ప్రత్యేక గోధుమ వంగడాన్ని (New Wheat Variety) అభివృద్ధి చేసినట్టు జర్మనీలోని (Germany) మ్యూనిచ్ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఈ సరికొత్త వంగడంతో కేవలం 10 వారాల్లోనే పంట చేతికొస్తుందని తెలిపారు. నీటి వాడకం కూడా 95 శాతం వరకు తగ్గుతుందని వివరించారు. ఈ మేరకు జర్మనీకి చెందిన సైన్స్ వెబ్‌సైట్ ‘డ్యుయిష్ వెల్లే’ ఓ పరిశోధన పత్రాన్ని ప్రచురించింది. ఒక ఎకరంలో ఏడాదికి 20 క్వింటాళ్ల గోధుమ పంటను పండించే రైతన్న.. ఈ వంగడం సాయంతో ఏడాదిలో అదే ఒక్క ఎకరాలోనే 100 క్వింటాళ్లకు పైగా పంటను పండించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ వంగడంతో ఆహార సంక్షోభానికి ముగింపు పలకవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)