Newdelhi, Nov 11: దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వైరల్ వ్యాధి చికెన్ గున్యా (Chikungunya) నియంత్రణలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొదటి చికెన్ గున్యా వ్యాక్సిన్ (Vaccine) కు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ‘Ixchiq’గా పిలిచే ఈ వ్యాక్సిన్‌ను ఫ్రెంచ్ బయోటెక్ కంపెనీ వాల్వేనా అభివృద్ధి చేసింది. చికెన్ గున్యా వైరస్ బారిన పడేందుకు ఎక్కువ ప్రమాదం ఉన్న 18 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారి కోసం ఈ వ్యాక్సిన్ ను యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదించింది. ఈ వ్యాక్సిన్ ను సింగిల్ డోసుగా ఇంజెక్షన్ ద్వారా కండరంలోకి పంపిస్తారు. చికెన్ గున్యా సోకిన దోమకాటు వల్ల మనిషికి ఈ చికెన్ గున్యా వ్యాధి వస్తుంది. గత 15 ఏండ్ల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది వరకు ఈ వైరస్ బారిన పడ్డారు.
“The world's first vaccine to protect against chikungunya virus, which is spread by mosquitoes, was just approved by the U.S. Food and Drug Administration (FDA).” https://t.co/6CPqUcJoqw
— The Daily Seeker (@TheDailySeeker) November 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)