కొత్త ఏడాదిలో మొదటి రోజు సూర్యోదయాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని జపాన్ వ్యోమగామి కొయిచీ వటాకా చెబుతున్నారు. ఓ ప్రాజెక్టు పనిమీద ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న కొయిచీ.. కొత్త సంవత్సరాన్ని తొలి సూర్యోదయంతో స్వాగతించారు. ఈ అరుదైన వీడియోను అంతరిక్ష కేంద్రం నుంచి తీసి పంపించారు. మానవజాతి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కొత్త ఏడాది, తొలి సూర్యోదయం రెండూ ఒకే సమయంలో తాను చూస్తున్నానంటూ కొయిచీ ట్విట్టర్ లో ఈ వీడియో పోస్టు చేశారు.

ఇది నిజంగా అద్భుతమేనని ట్విట్టర్ లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అంతరిక్షం నుంచి సూర్యోదయాన్ని చూడడమే గొప్ప అనుభూతి అంటే.. కొత్త సంవత్సరం, ఆ ఏడాది తొలి సూర్యోదయాన్ని ఒకేసారి స్వాగతించడం అత్యద్భుతమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొయిచీ పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)