స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కోట్లాది మంది ఖాతాదారుల కోసం అత్యవసర ప్రకటన చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో ఎస్‌బీఐ కస్టమర్లకు సమస్యలు ఎదురుకావచ్చని తెలియజేసింది. ఎస్‌బీఐ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ చేపట్టింది. దీని కారణంగా ఎస్‌బీఐ కస్టమర్‌లకు యూపీఐ సేవల్లో అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఎస్‌బీఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) పోస్ట్ ద్వారా తెలియజేసింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్న ఎస్‌బీఐ త్వరలోనే సమస్యను పరిష్కరిస్కామని వివరించింది.

Here's SBI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)