దేశంలో కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం గూగుల్ (google) తనవంతు సహకారాన్ని అందించింది. గూగుల్ ముఖ్యకార్యనిర్వహణాధికారి సుందర పిచాయ్.. భారత్‌కు 135 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన గివ్ ఇండియా (GivIndia)కు అందజేశారు. గివ్ ఇండియా ద్వారా యూనిసెఫ్‌కు ఈ విరాళం అందుతుంది. ఆ మొత్తంతో వైద్య పరికరాలు, ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత ఉపకరణాలను కొనుగోలు చేయడానికి వినియోగించే అవకాశాలు ఉన్నాయి.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా పేషెంట్లకు యూనిసెఫ్ తరఫున అత్యవసర వైద్య సహాయం అందుతుంది. ఆ చర్యలను యూనిసెఫ్ పర్యవేక్షిస్తుంది. సుందర్ పిచాయ్‌ను స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని బహుళజాతి కంపెనీలు భారత్‌కు తమవంతు ఆర్థిక సహాయాన్ని అందించడానికి, విరాళాలను ప్రకటించడానికి ముందుకొస్తున్నారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)