Newdelhi, May 7: భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునితా విలియ‌మ్స్(Sunita Williams) నింగి యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. ఆమెను అంతరిక్షంలోకి తీసుకెళ్లే బోయింగ్ స్టార్‌ లైనర్‌ రాకెట్ (Star Liner Rocket) లో సాంకేతిక లోపాలు ఏర్పడడంతో ప్రస్తుతానికి ప్రయోగాన్ని నిలిపివేశారు. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం ఈ ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కెనా వెరల్‌ లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్‌ లైనర్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. అట్లాస్ వి రాకెట్‌ లోని సెకండ్ స్టేజ్‌ లో ఉండే ఆక్సిజ‌న్ వాల్వ్ లీకేజీ కావ‌డంతో ప్ర‌యోగాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. వాయిదా పడిన ఈ ప్ర‌యోగానికి చెందిన కొత్త తేదీని త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

Kedarnath: 10న తెరుచుకోనున్న కేదార్‌ నాథ్‌ ధామ్‌.. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు కేదార్‌ నాథుడి దర్శనం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)