దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. సంస్థలోని ఉద్యోగులకు జీతాలు పెంచాలని(TCS Salary Hike) యోచిస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లుగా ‘బిజినెస్ స్టాండర్డ్’ కథనం ప్రచురించింది.దీని ప్రకారం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services ) 2024- 25 ఆర్థిక సంవత్సరంలో సంస్థలో పనిచేస్తున్న ఆఫ్ సైట్ ఉద్యోగులకు (offsite employees) సగటున 7- 8 శాతం వేతనాలు పెంచే ఆలోచనలో ఉంది. ఆగని లేఆప్స్, 195 మంది ఉద్యోగులపై వేటు వేసిన వోచర్ కంపెనీ షాప్‌బ్యాక్, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం
అలాగే ఆన్ సైట్ ఉద్యోగులకు (onsite employees) ఈసారి 2- 4 శాతం జీతాలు పెంచనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అద్భుతమైన పని తీరు కనబరిచిన ఉద్యోగులకు ఏకంగా 12- 15 శాతం వరకు వేతనం పెంచనున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ తన కథనంలో పేర్కొంది. ఈ వేతన పెంపు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది.
Here's News
TCS Salary Hike 2024: Tata Consultancy Services Likely To Offer 7-8% Raise to Offsite Employees, 2-4% to Onsite Staffers, Here's How Much High Performers May Get #TCS #TCSSalaryHike #SalaryHike #Salary #IT #InformationTechnology https://t.co/QiorZHrKxs
— LatestLY (@latestly) March 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)