కొలంబియాలోని ఓ జైలులో ఖైదీల మధ్య తలెత్తిన ఘర్షణ మరణాలకు దారితీసింది. నైరుతి కొలబియాలోని తులువా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో 51 మంది మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. జైలులో మంగళవారం ఖైదీలు మధ్య గొడవ మొదలైంది. దీనిని ఆపడానికి గార్డులు ప్రయత్నించారు. అయితే వారిని అడ్డుకోవడానికి ఖైదీలు.. దుప్పట్లు, ఇతర వస్తువులకు నిప్పంటించారు.

దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఆ పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో దాదాపు 24 మంది గాయపడ్డారని, వారిలో జైలు సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం జైలులో మంటలు అదుపులోకి వచ్చాయని, ఖైదీలెవరూ తప్పించుకోలేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో అందులో 1,267మంది ఖైదీలు ఉన్నారని వెల్లడించారు. మంటలు చెలరేగిన బ్లాక్‌లో 180 మంది ఉన్నట్లు తెలుస్తున్నది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)