చైనాకు సమీపంలోని ఎల్లో సముద్ర జలాల్లో భారీగా అణు ప్రమాదం చోటు చేసుకొంది. చైనాకు చెందిన ఓ అణు సబ్‌మెరైన్‌ ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ ఉచ్చులో చిక్కుకుపోయింది. ఫలితంగా 55 మంది సబ్‌మెరైనర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషయాన్ని బ్రిటీష్‌ మీడియా సవివరంగా కథనాలు ప్రచురించింది. ఈ ఏడాది ఆగస్టులో యెల్లో సీలో ఈ ఘటన చోటుచేసుకుందని యునైటెడ్ నేషన్స్ ఇంటెలిజెన్స్ శాఖ ఓ నివేదిక వెల్లడించింది. అయితే, ఈ వార్తలను చైనా కొట్టిపారేసింది. అలాంటి ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది.

యూకే వెల్లడించిన నివేదిక ప్రకారం.. యెల్లో సముద్రంలో ఆగస్టు 21న ఉదయం 8:12 గంటలకు (స్థానిక కాలమానం) ట్రాప్ లో చిక్కుకుంది. దీని ప్రభావంతో సబ్ మెరైన్ సిస్టం ఫెయిలైంది. మరమ్మతులు చేసి సబ్ మెరైన్ ను ఉపరితలానికి తీసుకురావడానికి సుమారు ఆరు గంటలు పట్టింది. అప్పటికే లోపల ఉన్న 22 మంది ఆఫీసర్లు, ఏడుగురు ఆఫీసర్ కాడెట్లు, 9 మంది పెట్టీ ఆఫీసర్లు, 17 మంది సెయిలర్లు అందరూ విగతజీవులుగా మారిపోయారు. ఆక్సీజన్ సరఫరా వ్యవస్థ మాల్ ఫంక్షన్ కారణంగా వారంతా చనిపోయారు. చైనా ప్రభుత్వం మాత్రం ఈ రిపోర్టును అధికారికంగా ఖండించింది.ఇదిలా ఉంటే బ్రిటన్‌ సబ్‌మెరైనర్లు కూడా ఈ ప్రమాదం విషయాన్ని ధ్రువీకరించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)