హాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ బ్రెజిల్ సింగ‌ర్ డార్లిన్ మోరైస్ (Singer Darlyn Morais) సాలీడు కాటు వేయ‌డంతో మృతి చెందారు. మోరైస్ (28) ముఖంపై సాలీడు క‌ర‌వడంతో గాయమై శ‌రీరాన్ని నిస్స‌త్తువ ఆవ‌హించింది. సాలీడు కాటుతో అల‌ర్జీకి గుర‌య్యాడ‌ని భావించిన తాము ఆస్ప‌త్రికి తీసుకువెళ్లామ‌ని గాయ‌కుడి భార్య జులినీ లిసోబ పేర్కొంది. చికిత్స అనంత‌రం ఈనెల 3న ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేశార‌ని తెలిపింది.

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దర్శకుడు అర్పుదాన్‌ మృతి, వార్త ఆలస్యంగా వెలుగులోకి..

అయితే మోరైస్ ఆరోగ్య ప‌రిస్ధితి దిగ‌జార‌డంతో ఆదివారం ప‌ల్మాస్ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మోరైస్‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కాక‌పోవ‌డంతో మోరైస్ సోమ‌వారం తుదిశ్వాస విడిచాడ‌ని లిసోబ తెలిపింది. మోరైస్ స‌వ‌తి కూతురు (18)కు కూడా పాదంపై సాలీడు క‌రిచింద‌ని ప్ర‌స్తుతం ఆమె చికిత్స పొందుతోంద‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్ధితి నిల‌క‌డ‌గా ఉంద‌ని పేర్కొంది.

Brazilian Singer Darlyn Morais (Photo-Instagram)

Here's News

 

View this post on Instagram

 

A post shared by DARLYN MORAIS (@darlynmorais)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)