చైనాలో హునాన్‌ ప్రావిన్స్‌లో ఒకే సారి 49 వాహనాలు ఢీకొట్టుకున్నాయి. హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌షాఖా నగరంలో షుచాంగ్-గ్వాంగ్‌జౌ హైవేపై 49 వాహనాలు ఢీకొన్నాయి. వాహనాలు వేగంగా ఢీకొట్టుకొవడంతో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.66 మంది గాయపడ్డారని స్థానిక ట్రాఫిక్ పోలీస్‌ శాఖ తెలిపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.గాయపడిన వారిని.. వారందరినీ ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)