చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై బ్లాక్‌ బీఎండబ్ల్యూ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. దాదాపు 13 మంది గాయపడ్డారు. సౌత్‌ చైనాలోని గ్వాంగ్‌జూ ప్రావిన్స్‌లోని సిగ్నల్‌ కూడలి వద్ద బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన భయంకర దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వీటిని పరిశీలిస్తే వ్యక్తి ఉద్ధేశపూర్వంగానే కారుతో జనాలను తొక్కించినట్లు తెలుస్తోంది. పాదాచారుల్ని ఢీకొట్టిన తర్వాత డ్రైవింగ్‌ సీట్లోని వ్యక్తి కారు నుంచి బయటకు వచ్చి నోట్లను విసిరేస్తూ కనిపించాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)