చైనాలోఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్వాంగ్జూ నగరంలోని పెరల్‌ నదిపై నిర్మించిన ఓ వంతెనను భారీ రవాణా నౌక (cargo ship) ఢీ కొట్టింది (Ship rams bridge). దీంతో నౌక ఢీ కొన్న ప్రదేశంలో వంతెన విరిగి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు గల్లంతయ్యారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఓ భారీ రవాణా నౌక ఫోషన్‌ (Foshan) నుంచి గ్వాంగ్జూ (Guangzhou) వైపు ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఉన్న లిక్సింషా వంతెనను ( Lixinsha Bridge) బలంగా ఢీ కొట్టింది.

దీంతో నౌక ఢీకొన్న ప్రదేశంలో వంతెన విరిగిపోయింది. నౌక వంతెన మధ్యలోనే చిక్కుకుపోయింది.వంతెన కూలిపోవడంతో దానిపై ప్రయాణిస్తున్న ఒక బస్సు సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. ఓ వ్యక్తి గాయపడ్డాడు. మరో ముగ్గురు నదీ ప్రవాహంలో గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో వంతెనపై ట్రాఫిక్‌ తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణమైన నౌక కెప్టెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)