సరిహద్దుల్లో చైనా మరోసారి బరితెగించింది. గాల్వన్ లోయలో జనవరి 1 తేదీన డ్రాగన్ కంట్రీ గాల్వన్ లోయలో తమ దేశపు జాతీయ జెండాను ఎగురవేసిందని చైనా అధికారిక పత్రికలో కథనాలు వచ్చాయి. భారత సరిహద్దులోని గాల్వన్ లోయలో ఇంచు భూమి కూడా విడిచిపెట్టమంటూ వీడియోను ట్వీట్ చేసింది. 2022 నూతన సంవత్సరం తొలి రోజున గాల్వన్ లోయలో చైనా జాతీయ జెండాను ఎగురవేసిందని ఈ జాతీయ జెండా ఒకప్పుడు బీజింగ్ లోని తియాన్ స్వేర్ పై ఎగిరింది కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైందని చైనా అధికార మీడియా ప్రతినిధి షెన్ షివి ట్వీట్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ సర్కారుపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.

చైనాకు ఈ విషయం మీద ధీటుగా బదులివ్వాలని ప్రధాని వెంటనే మౌనం వీడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశ విజయం కోసం ఒట్టిమాటలు కట్టిపెట్టి తెలివైన, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని రాహుల్ కోరారు.

ఇదిలా ఉంటే చైనా సైన్యం జెండా ఎగుర వేసిన ప్రదేశం వివాదాస్పద ప్రాంతం కాదని ఆర్మీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. చైనా అధీనంలోని ప్రదేశంలోనే పతాకావిష్కరణ జరిగిందని భారత సైన్యం తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)