అమెరికాలో నిర్వహించిన 95వ నేషనల్ స్పెల్లింగ్ బీ (US Spelling Bee) పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్‌షా విజేతగా నిలిచాడు. అతడు శామాఫైల్ (psammophile) అనే పదానికి స్పెల్లింగ్ చెప్పి 50 వేల డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకొన్నాడు. శామాఫైల్ అంటే ఇసుక నేలల్లో కనిపించే కనిపించే జీవి లేదా మొక్క అని అర్థం.ఈ పోటీల అనంతరం ట్రోఫీని అందుకొన్న తర్వాత దేవ్ మాట్లాడుతూ ‘‘ఇది నమ్మలేకపోతున్నాను.. ఇప్పటికీ నా కాళ్లు వణుకుతున్నాయి’’ అని పేర్కొన్నాడు.గతంలో కూడా దేవ్ స్పెల్లింగ్ బీ పోటీల్లో పాల్గొన్నాడు. 2019లో 51వ స్థానంలో.. 2021లో 76వ స్థానంతో సరిపెట్టుకొన్నాడు. ఈ సారి మాత్రం పోటీల్లో విజేతగా నిలిచి తన కలను నెరవేర్చుకొన్నాడు.
Video
That trophy hoist by #Speller36 Dev Shah though... #spellingbee pic.twitter.com/6SYrY9MC0a
— Scripps National Spelling Bee (@ScrippsBee) June 2, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)