టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ది ఫైనెస్ట్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటూ ‘బర్న్ట్ హెయిర్’ పేరుతో ఒక పెర్ఫ్యూమ్‌ను విడుదల చేశాడు. నా పేరులాంటి పేరుతో ఫ్రాగ్రెన్స్ బిజినెస్‌లోకి అనివార్యంగా వస్తున్నా..అంటూ ట్విటర్ బయోలో ఏకంగా పెర్‌ఫ్యూమ్ సేల్స్ మేన్ అని మార్చుకోవడం వార్తల్లో నిలిచింది. దాదాపు 100 డాలర్లు లేదా రూ. 8,400 ధరతో బుధవారం లాంచ్ చేసిన ఈ పెర్‌ఫ్యూమ్ లాంచ్ అయిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడు బోయిందట. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 10,000 పెర్‌ఫ్యూమ్ బాటిళ్లు అమ్ముడయ్యాయని మస్క్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ప్రస్తుతం దీనిపై సెటైర్లు, మీమ్స్‌తో ట్విటర్ యూజర్లు సందడి చేస్తున్నారు.
The finest fragrance on Earth!https://t.co/ohjWxNX5ZC pic.twitter.com/0J1lmREOBS
— Elon Musk (@elonmusk) October 11, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)