మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్, అడ్వర్టైజింగ్ మోడల్ షెరికా డి అర్మాస్ (26) కన్నుమూశారు. గత కొంతకాలంగా గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్న అక్టోబర్ 13న తుదిశ్వాస విడిచారని సోదరుడు మేక్ డి అర్మాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. షెరికా అకాల మరణంపై సొంత దేశం ఉరుగ్వేతోపాటు, ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది.షెరికా 2015లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వేకు ప్రాతినిధ్యం వహించారు. కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలతో దాదాపు రెండేళ్లపాటు ఈ మహమ్మారితో పోరాడి చివరికి తనువు చాలించారు.

2015 చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో షెరికా డి అర్మాస్ టాప్ 30లో స్థానం దక్కించుకోలేకపోయినప్పటకి, ఆరుగురు 18 ఏళ్ల పోటీదారుల్లో ఒకరిగా నిలిచింది.షే డి అర్మాస్ స్టూడియో పేరుతో హెయిర్‌, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తుల వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టింది. అంతేకాదు కేన్సర్‌తో బాధ పడుతున్న పిల్లల చికిత్స చేసే పెరెజ్ స్క్రీమినీ ఫౌండేషన్‌ కోసం కొంత సమయాన్ని వెచ్చించినట్టు తెలుస్తోంది

Former Miss World Contestant Sherika De Armas Dies At 26 (Miss Uruguay Pageant/facebook)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)