దేశంలో తీవ్ర ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కొంటున్న భారత్‌కు సౌదీ అరేబియా 80 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను పంపుతోంది. అదానీ గ్రూపు, ఆక్సిజన్‌ ఉత్పత్తిదారు లిండే కంపెనీ సహకారంతో 80 టన్నుల ఆక్సిజన్‌ను (Saudi Arabia to ship 80 metric tonnes of oxygen to India) పంపుతున్నట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘రియాద్‌లో భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు. ప్రపంచం నలుమూలల నుంచి ఆక్సిజన్‌ను భారత్‌కు తరలించే మిషన్‌లో నిమగ్నమయ్యాం. 80 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌తో 4 క్రయోజనిక్‌ ట్యాంకులు నౌకలో దమ్మామ్‌ నుంచి ముంద్రా పోర్టుకు బయలుదేరాయి’ అని అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ట్వీట్‌ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)