Newyork, Feb 25: అమెరికాలో (America) ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ఘటనలో భారతీయ యువకుడు ఫజిల్ ఖాన్ (27) దుర్మరణం చెందాడు. హార్లెమ్ ప్రాంతంలోని ఆరంతస్తుల అపార్ట్ మెంట్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ-బైక్‌ బ్యాటరీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. భవనంలో చిక్కుకుపోయిన ఫజిల్ ఖాన్‌ ను అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో మొత్తం 17 మంది గాయపడ్డట్టు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీకి చెందిన ఫజిల్ ఖాన్ కొలంబియా జర్నలిజం కాలేజ్‌ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఘటనపై భారతీయ ఎంబసీ విచారం వ్యక్తం చేసింది.

Uttar Pradesh Accident: యూపీలో ఘోర ప్రమాదం.. నదిలోపడిన యాత్రికుల ట్రాక్టర్‌.. చిన్నారులు సహా 15 మంది మృతి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)