టర్కీలో సంచలన ఘటన చోటు చేసుకుంది. మహిళలపై లైంగిక దాడులు, మైనర్లపై లైంగిక వేధింపులు కేసుల్లో ముస్లిం మత ప్రబోధకుడు అద్నాన్ అక్తర్ కు ఇస్తాంబుల్ కోర్టు ఏకంగా 8,658 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 66 ఏళ్ల అద్నాన్ అక్తర్ టీవీ షోలలో భారీ మేకప్, పొట్టి దుస్తులు ధరించిన మహిళల మధ్య కూర్చొని చర్చలు నిర్వహించేవాడు.

మహిళలపై లైంగిక దాడులు, మైనర్లపై లైంగిక వేధింపులు, మోసం, మిలిటరీపై గూఢచర్యం తదితర కేసుల్లో ఆయనకు గత ఏడాదే కోర్టు 1,075 ఏళ్ల శిక్షను విధించింది. అయితే పైకోర్టు ఈ తీర్పును కొట్టివేసింది. ఇస్తాంబుల్ హై క్రిమినల్ కోర్టు ఈ కేసును విచారించింది (రీట్రయల్). ఆయనతో పాటు ఆయన అనుచరులు మరో 10 మందికి 8,658 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 2018లో ఈయనను అరెస్ట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)