మేయర్ పదవికి వెంటనే రాజీనామా చేయకుంటే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు వస్తున్నాయని అమెరికన్ సిక్కు లీడర్ రవీందర్ ఎస్ భల్లా మీడియాకు తెలిపారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని హోబోకెన్ సిటీ మేయర్ గా 2017 లో తొలిసారి ఎన్నికైన భల్లా.. అమెరికాలోనే తొలి సిక్కు మేయర్ గా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2021లోనూ ఆయన మరోసారి మేయర్ గా ఎన్నికయ్యారు. అయితే, ఇటీవల గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు లేఖలు వస్తున్నాయని భల్లా ఆరోపించారు. వెంటనే మేయర్ పదవికి రాజీనామా చేయాలని ఆ లేఖలలో డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు తనకు మూడు లేఖలు అందాయని వివరించారు.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)