ఉత్తరకొరియా (North Korea) నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) తీవ్రమైన Insomniaతో బాధపడుతున్నాడని దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఎన్‌ఐఎస్‌) అంచనాకొచ్చింది.అంతే కాకుండా విపరీతంగా బరువు పెరిగినట్లు తన కథనంలో తెలిపింది. అతడికి ఉన్న ఆల్కహాల్‌, నికోటిన్‌ వ్యసనాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అధికారులు.. కిమ్‌ నిద్రలేమి సమస్యకు చికిత్స కోసం లోతైన వైద్యసమాచారం సేకరించే పనిలో పడ్డట్లు ఎన్ఐఎస్‌ గుర్తించింది.

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మద్యానికి, సిగరెట్లకు బానిసగా మారిపోయినట్లు అమెరికాకు చెందిన ఓ పత్రిక కథనంలో పేర్కొంది. దీంతో అతడిలో నిద్రలేమి సమస్యలు తలెత్తినట్లు తెలిపింది. ఫలితంగా అతడి కంటి కింద తీవ్రమైన నల్లటి వలయాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. అతడు జోల్పిడియం వంటి ఔషధాలను కూడా వాడుతున్నట్లు తెలిపింది.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)