లైబీరియా రాజధాని మొనోర్వియాలోని చర్చిలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 29 మంది మరణించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చి వద్ద రాత్రి వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో ప్రవేశించినట్టు సమాచారం. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరు కింద పడిపోగా, మిగిలిన వారు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. ఈ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. లైబీరియాలో దోపిడీ ముఠాలు వేడుకలను లక్ష్యంగా చేసుకోవడం అక్కడ సాధారణమే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)