ఆరువారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారం.. ఆపై పోలింగ్‌లో బ్రిటన్‌ ప్రధానిగా లిజ్‌ ట్రస్‌(47) ఘన విజయం సాధించారు.ట్రస్‌ విజయంతో.. బ్రిటన్‌కు మూడవ మహిళ ప్రధాని ఘనత దక్కినట్లయ్యింది. పోటీలో నిలిచిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ రిషి సునాక్‌కు నిరాశే ఎదురైంది. బోరిస్‌ జాన్సన్‌ వారసురాలిగా ట్రస్‌ ఎన్నికైంది. ఈ విషయాన్ని కన్జర్వేటివ్‌ పార్టీ సైతం అధికారికంగా ప్రకటించింది.లీజ్‌ ట్రస్‌కు వచ్చిన ఓట్లు 81,326 పోలుకాగా, రిషి సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. దీంతో 21 వేల ఓట్ల తేడాతో ట్రస్‌ నెగ్గినట్లయ్యింది.ఆన్‌లైన్, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు ఓటు వేసి కన్జర్వేటివ్‌ పార్టీ నేతను ఎన్నుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)