మలేషియాలో ఓ విమానం హఠాత్తుగా నేలపై కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందితో పాటు రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక కారు డాష్ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానం లాంగ్కావి లోని నార్తర్న్ రిసార్ట్ ఐలాండ్ నుండి బయలుదేరి రాజధాని కౌలాలంపూర్ కు పశ్చిమాన ఉన్న సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి చేరాల్సి ఉంది. విమానంలో ఆరుగురు ప్యాసింజర్ల తోపాటు ఇద్దరు సిబంది ఉన్నారని తెలిపారు.

విమానంలో ఎనిమిది మంది తోపాటు రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. మలేషియా సివిల్ ఏవియేషన్ అథారిటీ అధిపతి నొరాజ్ మన్ మహమూద్ తమకు ఈ విమానం నుండి ఎలాంటి మేడే(ప్రమాదాన్ని సూచించే) సిగ్నల్స్ అందలేదన్నారు. మలేషియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ సభ్యుడు మహమ్మద్ స్యామీ మహమ్మద్ హషీమ్ ఈ విమానం అస్థిరంగా వెళ్తుండటాన్ని తానూ చూశానని కొద్దిసేపటికే పెద్ద శబ్దం విన్నానని అన్నారు

Chilling Moments Captured in Dashcam of car (Photo Credits: Twitter)

 

Heres' Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)