ప్రపంచవ్యాప్తంగా మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించిన మీడియా దిగ్గజం, బిలియనీర్‌ రూపర్ట్‌ మర్డోక్‌(91) నాలుగో భార్య జెర్రీ హాల్‌(60) నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్, నటి జెర్రీ హాల్‌ను మర్డోక్‌ లండన్‌లో 2016లో వివాహమాడారు. మర్డోక్‌ కుటుంబ సన్నిహితుల సమాచారం మేరకు ఈ దంపతులు విడిపోతున్నట్లు తెలిసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. మర్డోక్‌ ఆస్తులు ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం సుమారు 1.38 లక్షల కోట్లు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని ప్రముఖ వార్తా సంస్థలను మర్డోక్‌ నిర్వహిస్తున్నారు. న్యూస్‌ కార్ప్, ఫాక్స్‌ కార్ప్‌ల్లో మర్డోక్‌కు వాటా 40% వాటా ఉంది. మర్డోక్‌ తన మొదటి భార్య, ఫ్లైట్‌ అటెండెంట్‌ అయిన పాట్రిసియా 1966లో విడిపోయారు. రెండో భార్య అన్నా నుంచి 1999లో, మూడో భార్య వెండీ డెంగ్‌తో 2014లో విడిపోయారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)