మెక్సికోలోని ఓక్సాకాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు 80 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 29 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. 17 మంది గాయపడ్డారని.. వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఓక్సాకా స్టేట్ ప్రాసిక్యూటర్ బెర్నార్డో రోడ్రిగ్జ్ అలమిల్లా పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభిస్తున్నామన్నారు. సివిల్‌ ప్రోటెక్షన్‌ ఏజెన్సీ ప్రకారం.. గాయపడ్డ ఆరుగురు అపస్మారక స్థితిలో ఉన్నారని, వారిని ఆసుపత్రికి తరలించిన సమయంలో విషమంగా ఉందని పేర్కొంది.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)