నాగర్నో-కారాబఖ్‌ ప్రాంతంలో ఆర్మేనియా సైనిక దళాలపై అజర్‌బైజాన్‌ (Nagorno Karabakh conflict) దళాలు దాడులకు దిగిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఓ గ్యాస్‌స్టేషన్‌ వద్ద భారీ పేలుడు (Gas Station explosion) సంభవించింది. ఈ ఘనటలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మంది తీవ్ర గాయాలపాలైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వీరికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇందులో చాలా మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నాగోర్నో-కరాబాఖ్‌ వివాదాస్పద ప్రాంతం విషయంలో అజర్‌బైజాన్‌-ఆర్మేనియా మధ్య వివాదం రాజుకుంది. దీంతో అక్కడి ఆర్మేనియా సైనిక దళాలపై అజర్‌ బైజాన్‌ దళాలు తిరుగుబాటు లేవనెత్తింది. దీంతో వేలాది మంది వేల మంది తమ వాహనాల్లో ఆర్మేనియాకు బయలుదేరారు.ఈ క్రమంలో ఓ గ్యాస్‌ స్టేషన్‌ వద్ద ఇంధనం కోసం వాహనాలు క్యూ కట్టాయి. అదే సమయంలో అక్కడ భారీ పేలుడు సంభవించింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)