న్యూయర్క్‌లో ఒక రైల్వేస్టేషన్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన తాలుకా వీడియోని న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్(ఎన్‌వైపీడీ) సోషల్‌ మీడియాలో విడుదల చేస్తూ... అతని ఆచూకి తెలిపిన వారికి సుమారు రూ. 2 లక్షల పైనే పారితోషకం ఇస్తామని ఒక బంపర్‌ ఆఫర్‌ కూడా ప్రకటించింది. న్యూయార్క్‌లోని ఒక సబ్‌వే స్టేషన్‌లో ఒక వ్యక్తి 52 ఏళ్ల మహిళను అనుసరిస్తూ... ఒక్కసారిగా తన రెండుచేతులతో సబ్‌వే ట్రాక్‌ల పైకి విసిరేశాడు. దీంతో ఆమె స్టేషన్‌ పేవ్‌మెంట్‌కి గుద్దుకుని సబ్‌వే ట్రాక్‌లపై పడిపోయింది. అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణికులు వెంటనే స్పందించి బాధిత మహిళకు సాయం అందించారు. ఐతే ఆ సమయంలో రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

న్యూయర్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి బేస్‌బాల్‌ క్యాప్‌ తోపాటు తెల్ల చొక్కా ధరించిన ఉన్నాడని అతని ఆచూకి తెలియజేయమంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఘటన తాలుకా వీడియోని పోస్ట్‌ చేయడమే కాకుండా సమాచారం అందిచాలనుకుంటే ఈ నెంబర్‌కి డయల్‌ చేయండి అంటూ ఒక ట్రోల్‌ ఫ్రీ నెంబర్‌ కూడా ఇచ్చింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)