దక్షిణ అమెరికా దేశం పెరూలో ఘోర విషాదం చోటు చేసుకుంది. దాదాపు 70 మంది మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలోకి దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఆండెస్‌ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటా వెళ్తుతుండగా అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా 200 మీటర్ల లోతులో ఉన్నలో లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)