మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వాషింగ్టన్ డీసీలో ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశం కానున్నారు. క్వాల్ కామ్, అడోబ్, బ్లాక్ స్టోన్, జనరల్ అటామిక్స్, ఫస్ట్ సోలార్ కంపెనీల అధిపతులు ప్రధానమంత్రితో సమావేశమవుతారు. అలాగే మోదీ తన పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రేపు ప్రధాని నరేంద్ర మోదీకి వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వనున్నారు. అమెరికాతో భారత ద్వైపాక్షిక సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పెట్టుబడులు, రక్షణ రంగాలు, అఫ్ఘానిస్థాన్‌లోని పరిస్థితులు, ఉగ్రవాద నిరోధం, ఇండో-పసిఫిక్, వాతావరణ మార్పులు వంటి అంశాలపై బైడెన్‌తో మోదీ చర్చలు జరపనున్నట్లు సమాచారం.
PM Modi to meet Australian PM, Kamala Harris, global CEOs on first day of US visit
Read @ANI story | https://t.co/i1bEjBTm1f#PMModiUSVisit #PMModi pic.twitter.com/6w0mutfUgg— ANI Digital (@ani_digital) September 23, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)