డొమినికన్‌ రిపబ్లిక్‌లో (Dominican Republic) ఘోర విమాన ప్రమాదం జరిగింది. రాజధాని శాంటో డొమింగోలో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కూడిన ఓ ప్రైవేటు విమానం డొమినికన్‌లోని లా ఇసబెల్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్తున్నది. టెకాఫ్‌ అయిన 15 నిమిషాలకే రాజధాని శాంటో డొమింగోలో ఉన్న లాస్‌ అమెరికాస్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా లాండ్‌ అయింది. ఈ క్రమంలో విమానం పేలిపోయిందని (Private Jet Crashed), తొమ్మిది మంది మరణించారని విమానయాన సంస్థ వెల్లడించింది. వారిలో ఆరుగురు విదేశీ ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారని పేర్కొన్నది. అయితే వారు ఏ దేశానికి చెందిన వారనే విషయంపై స్పష్టనివ్వలేదని స్థానిక మీడియా వెల్లడించింది. మరొకరు డొమినకన్‌ అని తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)