మాస్కోలో వార్షిక విలేకరుల సమావేశంలో రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin)కు షాకింగ్ అనుభవం ఎదురైంది. అచ్చం పుతిన్‌ వలే ఉన్న మరో వ్యక్తి లైవ్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), దాని వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రశ్నించారు. ‘‘నేను సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ స్టేట్‌ యూనివర్శిటీ విద్యార్థిని. మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా. మిమ్మల్ని పోలిన వ్యక్తులు చాలా మంది ఉన్నారన్నది నిజమేనా? ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో మన జీవితాలకు ఎలాంటి ముప్పు ఉందనుకుంటున్నారు?’’ అని ఆ పుతిన్‌ ‘డబుల్‌’ ప్రశ్నించారు.

ఆ ఏఐ మాయను చూసి ఒకింత ఆశ్చర్యపోయిన పుతిన్‌.. కాసేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత రష్యా అధినేత మాట్లాడుతూ.. ‘‘నన్ను పోలిన తొలి వ్యక్తివి నువ్వే. నువ్వు నాలాగే ఉండొచ్చు. నాలాగే మాట్లాడొచ్చు. కానీ, అచ్చం నాలాగే ఉండే వ్యక్తి.. నాలాగే మాట్లాడే వ్యక్తి ఒకే ఒక్కరు ఉన్నారు. అది నేనే’’ అని అన్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by RT (@rt)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)