ర‌ష్యా ఈ రోజు కాల్పులు విర‌మ‌ణ ప్ర‌క‌టించింది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఆయుధాలు మోగ‌బోనున్నాయి. విద్యార్థుల త‌ర‌లింపు నేప‌థ్యంలో భార‌త్ ఆందోళ‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్‌లోని సుమీలో చిక్కుకున్న భారతీయుల త‌ర‌లింపు సుర‌క్షితంగా చేపట్టాల‌ని ప్ర‌ధాని మోదీ ఇప్ప‌టికే ఉక్రెయిన్‌, ర‌ష్యా అధ్య‌క్షుల‌తో సంభాషించారు. అయితే కీవ్‌, చెర్నిహివ్‌, సుమీ, ఖార్కివ్‌, మారిపోల్ న‌గ‌రాల్లో చిక్కుకున్న వారిని త‌ర‌లించేందుకు కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించిన‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ కార్యాల‌యం పేర్కొన్న‌ది. అయితే ర‌ష్యా ప్ర‌క‌టించిన త‌ర‌లింపు రూట్ల‌పై ఉక్రెయిన్ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. ఆ దారుల‌న్నీ ర‌ష్యా, బెలార‌స్ వైపు వెళ్తున్న‌ట్లు ఆరోపించింది. త‌ర‌లింపు ప్ర‌క్రియ అనైతికంగా ఉన్న‌ట్లు ఉక్రెయిన్ విమ‌ర్శించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)